కేజీబీవీ కళాశాలలో కిషోర్ బాలికలకు పోషకాహార కిట్ల పంపిణీ

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జన్నారం మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో కిశోర బాలికలకు, విద్యార్థులకు పోషకాహారం గురించి అవగాహన సదస్సు, పోషకాహారం కిట్లుపంపిణీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ పోషకాహారల గురించి దాని వివరణ తెలిపారు. సరైన సమయంలో భోజనం భుజించాలని, పాఠశాలలో గాని ఇంటి వద్దగాని కూరగాయలు క్యారెట్, బుట్ రూట్స్ తీసుకోవడం వలన విద్యార్థులు దృఢంగా ఉండి బలంగా తయారవుతారని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బాగాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, మహిళా సాధికారతకేంద్రం ఆర్థికఅక్షరాస్యత నిపుణురాలు లిప్సిక, విజయ స్పెషల్ ఆఫీసర్ స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕