జన్నారం మండలం రేండ్లగూడ గ్రామంలోని సర్వేనెంబర్ 61, 62 అల్లంవారి కుంట సుమారు 24 శిఖం భూమిలలో 23 ఎకరాలు భూమికబ్జా గురైందని కుంటను పరిరక్షించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం రేండ్లగూడ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రిలేనిరాహార దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ మండల తాసిల్దార్ ఇరిగేషన్ అధికారులకు అకుంటా కబ్జా విషయంలో దరఖాస్తు ఇవ్వాగ, సమస్య పరిష్కరించపొగా, మంచిర్యాల జిల్లాకలెక్టర్ కార్యాలయంలో అ కుంట కబ్జా గురైందని, పూర్తిగా తనిఖీలు నిర్వహించి కబ్జా నుండి కాపాడలని కలెక్టర్ ను కోరారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించి కంచ వేసి హద్దులు ఏర్పాటు చేయాలని ప్రజలు, రైతులు కోరారు.