పిప్పల్‌ కోటిలో ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ పథకాలపై అవగాహన

భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి గ్రామంలో మంగళవారం ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సమ్మిళిత పథకాల ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM) ఉత్పల్ కుమార్ ధామ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (PMJDY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY) పథకాల ప్రయోజనాలను వివరించారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, APBS, నామినీ నమోదు, రీ-కేవైసీ, సీ-కేవైసీ నవీకరణ ప్రాధాన్యతను తెలియజేశారు. అలాగే క్లెయిమ్ చేయని డిపాజిట్లు, నిరుపయోగంగా ఉన్న బ్యాంకు ఖాతాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్

✕
✕