జన్నారం: ప్రజల పోరాటానికి పూర్తి మద్దతు

భారీ వాహనాలను అనుమతించాలని కోరుతూ జన్నారం మండల ప్రజలు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పి. ఆశయ్య స్పష్టం చేశారు. ప్రజల దీక్షకు మద్దతుగా సీపీఎం జిల్లా, మండల కమిటీ నాయకులు శుక్రవారం స్థానిక బస్టాండ్ వద్దనున్న ప్రధాన రహదారిపై రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు. భారీ వాహనాలు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని, అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంఖ్య రవి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్