ఖానాపూర్ పట్టణంలో శనివారం ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్లు, కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిన వందల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ఎస్సీ, ఎస్టీలకు పంచడం ఖాయమని తెలిపారు. కబ్జాలపై విచారణను స్వాగతిస్తున్నామని, ధరణి పేరుతో రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి, ప్రభుత్వ భూములను తమ పేర్లపైకి మార్చుకున్నారని ఆరోపించారు. స్వాధీన భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.