దోమలు కుట్టకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ అసిస్టెంట్ కమలాకర్, రాంపూర్ గ్రామ కార్యదర్శి రమేష్ అన్నారు. శుక్రవారం గ్రామంలోని ప్రధాన కాలనీలలో వారు పర్యటించి ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాలలో దోమలు పెరిగితే వైరల్ జ్వరాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇళ్ల ఆవరణలో నీటిని నిలువ ఉండకుండా చూసుకొని దోమతెరలు వాడాలని ప్రజలను వారు కోరారు.