జన్నారం మండలంలోని తపాలాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు వజ్రమాల శనివారం బీరువాను విరాళంగా అందజేశారు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసి బదిలీపై వెళ్తున్నారు. పాఠశాలలో ఉన్న రికార్డులను భద్రపరిచేందుకు ఆమె బీరువాను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మురళీధర్, పిఈటి షరీష్మ, తిరుపతి, చంద్రిక, రాజేందర్, గోపాల్, రామారావు, శ్రీనివాస్, సాయన్న, తదితరులు పాల్గొన్నారు.