జన్నారంలో నిర్వహించే సీపీఎం మంచిర్యాల జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఐద్వా మహిళా సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. గురువారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ శుక్రవారం జన్నారం పట్టణంలోని జ్యోతి గార్డెన్స్ లో సీపీఎం విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర నాయకులు బండారి రవికుమార్, పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి, మండల కార్యదర్శి కనికారపు అశోక్ హాజరవుతారన్నారు. ఆ సమావేశానికి అందరూ రావాలని ఆమె సూచించారు.