జన్నారంలోని గాంధీ నగర్ లో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ కుక్కను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. గాంధీ నగర్ కు చెందిన ఒక వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న బావిలో శుక్రవారం కుక్క పడిపోయిందని తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని బావిలో పడ్డ కుక్కను అతి కష్టం మీద బయటకు తీశారు. వినియోగించని బావులపై కప్పులు వేయాలని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ కోరారు.