జన్నారం: మంచి మనసు చాటుకున్న ఫౌండేషన్ సభ్యులు

జన్నారం మండలంలోని బాదంపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేసి ఆశాజ్యోతి ఫౌండేషన్ సభ్యులు మంచి మనసును చాటుకున్నారు. శుక్రవారం వారు ఆ పాఠశాలకు వెళ్లి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు 50 బ్యాగులు, 300 నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు కాశెట్టి వెంకన్న, తాటికొండ రమేష్, నాయిని రమేష్ గౌడ్, పోడేటి రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్