జన్నారం మండల అభివృద్ధికి కవ్వాల్ అభయారణ్యంలో భారీ వాహనాల రాకపోకలు అవసరమని డిమాండ్ చేస్తూ, స్థానిక ప్రజలు, నాయకులు, సామాజికవేత్తలు గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. అటవీ ఆంక్షలతో మండలం వెనుకపడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎఫ్డిఓకి మెమోరాండం ఇచ్చి, ప్రభుత్వం స్పందించాలని కోరారు.