జన్నారం: తప్పకుండా సికిల్ సెల్ పరీక్షలు చేయించుకోవాలి

గిరిజనులు తప్పకుండా సికిల్ సెల్ పరీక్షలు చేయించుకోవాలని హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్ సూచించారు. గురువారం జన్నారం మండలంలోని కవ్వాల్ గిరిజన బాలికా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సికిల్ సెల్ అనీమియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గిరిజన గ్రామాలలో ఎక్కువగా రక్తహీనత ఉంటుందని, వారు తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్