టైగర్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో 49ను వెంటనే రద్దు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నక విజయ్ కుమార్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జుకు గురువారం ఉదయం వినతి పత్రం అందించారు. జీవోను రద్దు చేయకుంటే ఆందోళనలు ముమ్మరం చేస్తామన్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తీసుకుని వచ్చిన ఈ జీవోను రద్దు చేయాలని, ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆపబోమని స్పష్టం చేశారు.