కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేయడంపై ఆయకట్టు రైతులలో హర్షం వ్యక ్తం అవుతోంది. వానకాలం సీజన్ కు సంబంధించి ఆయక ట్టు పరిధిలోని కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు నుండి సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మంగళవారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ప్రాజెక్టు నుండి ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయనున్నారు.