కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్ట్ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 174 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. లెఫ్ట్ కెనాలు 55, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగవకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.