ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాలలో రైతులు వానాకాలం సీజన్ వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. గత వారం రోజులుగా ఆయా మండలాలలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. నేల కూడా సాగుకు అనుకూలంగా మారింది. దీంతో రైతులు తమకు అందుబాటులో ఉన్న నాగలి, ట్రాక్టర్లు, తదితర వ్యవసాయ పరికరాలతో పనులను ముమ్మరం చేశారు. ఇప్పటికే కొంత మంది రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పచ్చి రొట్టె సాగు పంటలను సాగు చేశారు.