ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ మేళాను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం ఎఏంకే ఫంక్షన్ హాల్ లో 60కి పైగా కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ఖానాపూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి నిరుద్యోగ యువకులు ఇప్పటికే వారి పేర్లను నమోదు చేయించుకున్నారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జామ్సన్ నాయక్ కోరారు.