బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ పట్టణ, మండల నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఆదివారం ఖానాపూర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు.