శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకే కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఖానాపూర్ సిఐ అజయ్ అన్నారు. శుక్రవారం ఉదయం ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ లో పోలీసులు కాదని సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రాహుల్, సాయి కిరణ్, హనుమాండ్లు పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.