ఖానాపూర్: మెగా జాబ్ మేళాను వినియోగించుకోవాలి

ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్ లో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు వినియోగించుకోవాలని  బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ కోరారు. శుక్రవారం ఉదయం ఖానాపూర్ లో ఆయన మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు మేలు చేయాలనే ఉద్దేశంతో శనివారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో సుమారు 60 కి పైగా కంపెనీలు ఉద్యోగాలను భర్తీ చేస్తాయన్నారు. తగిన ఆసక్తి, అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు రిజిస్ట్రేషన్ లింక్: [ https: //forms. gle/yq3vD2uczox9jf3U9 ] లో పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్