జనగణన సర్వే ప్రారంభించిన ఖానాపూర్ ఎమ్మెల్యే

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం తన స్వగ్రామం కల్లూరుగూడాలో జనగణన సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ల్యాప్‌టాప్‌లో వివరాలు నమోదు చేసుకుని స్వీయ సర్వేకు శ్రీకారం చుట్టారు. చదువుకున్న యువత మొబైల్ ఫోన్లలో స్వీయ గణన చేసుకొని, వచ్చిన ఐడీ నంబర్‌ను అధికారులకు చెబితే వారి వివరాలు అధికారికంగా నమోదవుతాయని ఆయన తెలిపారు. యువత సహకారంతో సర్వేను తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్