శంభు విగ్రహ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన ఖానాపూర్ ఎమ్మెల్యే

ఆదివాసీ తొలి తరం ఉద్యమ నాయకుడు సిడం శంభు విగ్రహన్నీ మత్తడి శంభుగూడలో ఏర్పాటు చేయాలని మత్తడి గూడ గ్రామ వాసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్