భారీ వాహనాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతించాలని మున్నూరు కాపు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. భారీ వాహనాల కోసం జన్నారంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న సామాజికవేత్త భూమాచారి, బీజేపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బద్రీ నాయక్ లకు మద్దతు తెలిపారు. భారీ వాహనాలు రాకపోవడంతో అభివృద్ధి జరగడం లేదని సంఘం నాయకులు కాసేటి లక్ష్మణ్ వాపోయారు.