ఖానాపూర్: రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఖానాపూర్ మండలంలోని వివిధ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఖానాపూర్ పట్టణంలోని సబ్ స్టేషన్ తో పాటు సూర్జపూర్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. నెలవారి మరమ్మతులు, చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వారు వివరించారు.

సంబంధిత పోస్ట్