సేవ పరులకు సమాజంలో శాశ్వత గుర్తింపు ఉంటుందని ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, జాదవ్ అనిల్ కుమార్ లు పేర్కొన్నారు. శనివారం ఖానాపూర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత జాబ్ మేళాలో పాల్గొని ప్రసంగించారు. 60 ప్రైవేట్ కంపెనీలతో ఈ జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అధికారంలో ఉంటేనే ప్రజాసేవ కాదన్నారు. ఇందులో నాయకులు, నిరుద్యోగ యువకులు ఉన్నారు.