ఖానాపూర్ శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి పుష్పయాగం, నాగవేల్లి, ఏకాంతసేవలతో ఘనంగా ముగిశాయి. యజ్ఞాచార్యులు చక్రపాణి వాసుదేవాచార్యులు, చక్రపాణి నరసింహాచార్యులు, నిమ్మగడ్డ సందీప్ శర్మలు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు అడ్డగట్ల రాజన్న, ప్రధాన కార్యదర్శి నిమ్మల రమేష్, కోశాధికారి ఉషకోల సుధాకర్, సభ్యులు, భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.