రైతులకు ఆత్మ కమిటీ పాలకవర్గ సభ్యులు మంచి సేవలు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. గురువారం ఖానాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆత్మ కమిటీ నూతన చైర్మన్గా తోట సత్యం, పాలకవర్గ సభ్యులతో ఎమ్మెల్యే పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన వ్యవసాయ సాగు విధానాలు, సాంకేతికతపై రైతులలో ఆత్మ కమిటీ సభ్యులు చైతన్యం తీసుకురావాలని ఆయన సూచించారు.