లక్షెట్టిపేట: ముమ్మరంగా వరి నాట్లు ప్రారంభం

లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో ముమ్మరంగా వరి నాట్లు ప్రారంభమయ్యాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు వరప్రదాయనిగా ఉన్న కడెం ప్రాజెక్టుతో పాటు ఖానాపూర్ లోని సదర్ మాట్ ప్రాజెక్టు నుండి రైతుల పొలాలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మంచి దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసి వరి నాట్లు వేస్తున్నారు. కొంతమంది రైతులు ఆ పంటకు ప్రత్యేకంగా పత్తి, కాయగూరలు, మొక్కజొన్న, జొన్న పంటలు వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్