బాల్య వివాహాలకు ప్రజలు దూరంగా ఉండాలని పలు శాఖల అధికారులు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పాత ఊట్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సివిల్ రైట్స్ డేను నిర్వహించారు. వారు మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని అన్నారు. అస్పృశ్యత, బాల్య వివాహాలను చట్టం విరుద్ధమని, ప్రజలు కలిసిమెలిసి ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.