లక్షెట్టిపేట: నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

నిరుపేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి. ఆరీఫ్ అన్నారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించడం జరుగుతుందని ఆయన వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్