ఖానాపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 1న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో వారి సేవలు అమూల్యమని, ప్రజల ఆరోగ్యానికి వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమని న్యాయవాదులు అభినందించారు. ఈ సందర్భంగా కార్మికులకు శాలువాలతో సత్కరించారు. నిత్యం కష్టపడి పని చేసే ఈ కార్మికులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజం వారిని మరింత గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయవాదులు ఎల్లప్పుడూ వారి వెంట ఉంటామని హామీ ఇచ్చారు.