ఆదర్శంగా తీసుకుందాం

మహాత్మ జ్యోతి బాపూలేను ఆదర్శంగా తీసుకుందామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని గురువారం సాయంత్రం ఖానాపూర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి మహాత్మ జ్యోతిబాపూలే కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, వైస్ చైర్మన్ కావలి సంతోష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్