స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఈనెల 3న ఖానాపూర్ నియోజకవర్గంలో చేపట్టనున్నారని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆరోజు సాయంత్రం 5 గంటలకు బాదన్ కుర్తికి చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.