ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

కుభీర్ మండలంలోని జామ్‌గావ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన గృహాలను పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అలాగే గ్రామంలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్