ఫలించిన ఎమ్మెల్యే పోరాటం.. ఇంన్చార్జి ఎఫ్ ఆర్ ఓ సస్పెండ్

నిర్మల్ జిల్లా, ఖానాపూర్ లో ఆదివాసీ యువకులపై అటవీ శాఖ అక్రమ దాడులను నిరసిస్తూ గిరిజనుల పక్షాన ఎమ్మెల్యే చేసిన పోరాటానికి ఫలితంగా, ఇంధన్ పల్లి ఇంచార్జీ ఎఫ్ఆర్ఓ లక్ష్మీ నారాయణను సస్పెండ్ చేస్తూ అటవీ శాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు. ఈ ఉత్తర్వులను స్థానిక గ్రామస్తులు గుర్తించి, సహాయ నిరాకరణను విరమించుకోవాలని వేడ్మ బోజ్జు పటేల్ తెలిపారు. అటవీ శాఖ అధికారులు గ్రామ అభివృద్ధిని అడ్డుకోవడాన్ని సహించబోమని, స్థానిక గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయన అన్నారు. అభివృద్ధి కోసం స్థానిక ప్రజలంతా ఐకమత్యంతో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్