మొక్కలను పంపిణీ చేసిన ఎంపీడీవో

జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న ప్రజలకు ఎంపీడీవో శశికళ మొక్కలను పంపిణీ చేశారు. బుధవారం ఆమె జన్నారం మండలంలోని టీజీపల్లి, చింతగూడ, మొర్రిగూడ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ నర్సరీని సందర్శించారు. అనంతరం ఆయా గ్రామాలలో ఉన్న ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. వన మహోత్సవం దృష్ట్యా ఇంటి పరిసరాలలో మొక్కలు నాటాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జన్నారం ఎంపీఓ సింగిడి రమేష్, ఈజీఎస్ ఏపీవో రవీందర్, కార్యదర్శులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్