డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు లక్షెట్టిపేట తాలూకాలో పర్యటించనున్నారు. ఆదివారం లక్షెట్టిపేటలో ప్రభుత్వ నూతన ఆసుపత్రి భవనాన్ని వారు ప్రారంభిస్తారు. దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లిలో సోలార్ ప్లాంట్ కు వారు భూమి పూజ చేస్తారు. అనంతరం హాజీపూర్ మండలంలో పలు కార్యక్రమాలు, బహిరంగ సభలలో పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేశారు.