ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణం పెంచాలి: ఎమ్మెల్యే

నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మంగళవారం ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణం పెంచాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకొని, ఉద్యాన పంటలు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్