జన్నారంలో శుక్రవారం ఐద్వా మహిళా సంఘం జిల్లా నాయకురాలు విజయ శంకర్ మాట్లాడుతూ, సమాజంలో వికలాంగులపై చిన్నచూపు తగదని అన్నారు. శారీరక అంగవైకల్యంతో ఉన్న వారిని, దివ్యాంగులను చాలామంది దూరం పెడుతున్నారని, చివరికి తల్లిదండ్రులు కూడా వారిని పట్టించుకోవడం లేదని, జన్నారంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.