కవ్వాల్ టైగర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు తొలగింపు: ముగ్గురి అరెస్ట్

కవ్వాల్ టైగర్ జోన్, జన్నారం డివిజన్ పరిధిలోని కంపార్ట్మెంట్ నెంబర్ 308లో అటవీ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నారు. అక్రమంగా నిర్మించిన 16 గుడిసెలను తొలగించారు. గతంలో ఖాళీ చేయించిన టైగర్ రిజర్వ్ కోర్ ప్రాంతాన్ని ఆక్రమణదారులు మళ్లీ ఆక్రమించినట్లు గుర్తించారు. మరో 13 మందిపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్