నిర్మల్ జిల్లా, కడెం మండలంలోని పెద్ద బెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని మొర్రిగూడెంలో బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని గురువారం రోడ్డు మరమ్మతులు చేపట్టారు. రోడ్లు గుంతలమయంగా మారి మహిళలు ఇబ్బంది పడకుండా, సర్పంచ్ ఈదుల తిరుపతి చొరవతో మొరం పోయించి రోడ్డును చదును చేయించారు. వేడుకల కోసం విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తక్కుల్లా రమ్య రవీందర్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.