ఉట్నూరు మండలంలోని వడగల్పూర్ గ్రామంలో మరాఠీ ప్రజలు సిరాల్ దేవ్ పూజను ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం పురస్కరించుకొని నాగుల పంచమి తర్వాత వారు గ్రామంలో సిరాజ్ పూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో గ్రామంలో మరాఠా భాష మాట్లాడే ప్రజలు గురువారం ఆంద్ హాట్కర్ ధన్గర మరాఠా సమాజంలో భక్తి శ్రద్దలతో పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే మహిళలు, కుటుంబ సభ్యులు కలిసి సమీప పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.