కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షలో మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, బాదంపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల సౌమ్యశ్రీ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. నిర్మల్ జిల్లా, ఖానాపూర్ లో జరిగిన ఈ పరీక్షలో సౌమ్యశ్రీ మంచి ప్రతిభ కనబరిచారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ అధికారిగా సేవలందించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మిత్రులు, గ్రామస్తులు అభినందించారు.