ఖానాపూర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి: బోజ్జు పటేల్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బోజ్జు పటేల్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, కవ్వాల్ టైగర్ జోన్ అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేసి ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అటవీశాఖ నిబంధనలు, అధికారుల అభ్యంతరాల కారణంగా జన్నారం, దస్తురాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల ప్రజలు ఇళ్ల నిర్మాణం, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అటవీశాఖ సమస్యలను పరిష్కరించి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే అడ్డంకులను తొలగించాలని సీఎంను కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕