అందరి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం సాయంత్రం పెంబి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.