ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ డైరెక్టర్ గా పనిచేసి బదిలీపై వెళ్తున్న డాక్టర్ దిలీప్ కుమార్ సేవలు ప్రశంసనీయమని ఆదివాసి హక్కుల పోరాట సమితి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు పుర్క బాపూరావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆ సమితి నాయకులు ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో డిడిని కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసి సంఘాల ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.