సమానత్వం కోసం కృషి చేసిన అన్నాభావు సాటే ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు ప్రముఖులు అన్నారు. అన్నాభావు సాటే 105వ జయంతిని పురస్కరించుకొని ఉట్నూర్ పట్టణంతో పాటు హస్నాపూర్ గ్రామంలో ఉన్న సాటే విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలలో ఐక్యత, చైతన్యం కోసం అన్నా భావు సాటే కృషి చేశారని వారన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు, సంఘాల ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.