ఉట్నూర్ మండల కేంద్రంలో అన్నాభావు సాఠే 105వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కమిటీ సభ్యుల వినతి మేరకు సమస్యలు పరిష్కరిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.