ఉట్నూర్ మండలంలోని ఘన్ పూర్ గ్రామానికి చెందిన కోవ శ్యామల తల్లితండ్రులు ఏడాది కాలంలో మృతి చెందారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా శ్యామల ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ను కలసి తన గోడును వినిపించింది. వెంటనే స్పందించిన వెడ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఎమ్మెల్యే తనవంతుగా శుక్రవారం రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.