ఉట్నూర్: 'జీవో నెంబర్ 49 రద్దు చేయాలని వినతి'

ఆదివాసులకు నష్టం చేసే జీవో నెంబర్ 49 రద్దు చేయాలని ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు వినతి పత్రం సమర్పించారు. సోమవారం ఉట్నూరు పట్టణంలోని ఐటిడిఐ కార్యాలయంలో పిఓకు వారు వినతి పత్రం అందించారు. జీవో నెంబర్ 49 తో ఆదివాసుల మండలాలకు ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్